పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0304-5 నాదరామక్రియ సంపుటం: 11-023

పల్లవి: ఇందరము నెరిగితి మిఁక నేలా
         సందడి సవతులలో సరి నుండుఁ గాకా

చ. 1: నిక్కి నిక్కి చూచి యాపె నీతో నేల సన్న సేసీ
       రక్కసితనము మాని రమ్మన రాదా
       దక్కి వున్నాఁడవు నీవు తనపాలిటికిఁ దొల్లె
       వెక్కస మై నే నుండితే వెర పేల తనకు

చ. 2: అంత నింత నుండి నీతో ఆపె యాల నవ్వీని
        వంతుకు నీతోఁ బెనఁగ వచ్చుఁ గాక
        వింతవాఁడవా నీవు వేరు నే మింతే కాక
        యింతేసి పనులు సేసె యిఁక నేల వెఱపూ

చ. 3: పొరుగుపొంతల నాపె పూఁచి ని న్నేల కూడీని
        సిరులు నీసొమ్ము గాఁగఁ జేసుకో రాదా
        యిరవై నన్నుఁ గూడితి విదె శ్రీవెంకటేశుఁడ
        తెరవాసె వెర పేల తెల్ల మాయఁ బనులు