పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0304-4 సాళంగనాట సంపుటం: 11-022

పల్లవి: ఏఁటివో నీకే తెలుసు నివి యిన్నియు
         మాటు లేని నీగుణాలు మట్టు లేనివె

చ. 1: తేనెలు గారెడిమాట తేరకొన నాడేవు
       కానుక వట్టెటిచూపు కడు జల్లేవు
       లోనైరినీ కిందుకే లోకములో చెలు లెల్ల
       వీనుల నీసుద్దు లైతే వినఁ గొత్తలె

చ. 2: కడు నీవినయుములు కస్తురివంటివె
       బడిబడి నీవలపు పాలవంటిదె
       విడువరు ని న్నిందుకే వీదివీదిసతు లెల్ల
       తడవతే నీవిధాలు తమకించేవే

చ. 3: చెలఁగి నీకూటములు జిగు రయి అంటుకొను
       అలరు నీముచ్చటలు ఆనందాలు
       కలసితి విదె శ్రీవెంకటగిరీశ్వర నన్ను
       బలు నీ మన్ననలు పైపై భాగ్యాలె