పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0303-6 శ్రీరంగం సంపుటం: 11-018

పల్లవి: ఎందరి భ్రమించితివో యిటువలెనే
         యెందును నీ మర్మ మిది యెరఁగ మైతిమిరా

చ. 1: మచ్చికల నీతోడ మాటలాడి నిన్నటి
       మచ్చరపుటుకలు మరచితిని
       మచ్చట నీవిటువంటి మెకమాయకాఁడ వౌత
       యిచ్చలోన నేము తొల్లె యెరఁగ మైతిమిరా

చ. 2: పక్కన నిన్ను దగ్గరి పంతపుమాట లెల్ల
        మక్కళించి యాడ నీతో మరచితిని
        గక్కన నీ వింతతమకములు నేరుచుకొంట
        యిక్కువగా నేఁడు నేము యెరఁగ మైతిమిరా

చ. 3: పెనఁగి పెనఁగి నీతోఁ బెట్టుకొన్నవొట్లెల్ల
       మన సిచ్చి కూడి నే మరిచితిని
       ననిచి శ్రీవెంకటేశ నాఁటఁకీడ వవుత నిన్ను
       యెనసినవేళ నేమీ నెరఁగ మైతిమిరా