పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0303-5 కేదారగౌళ సంపుటం: 11-017

పల్లవి: చిత్త మెట్టుండెనో నేఁడు చేసిన నాచేఁతలకు
         అత్తి మొక్కి అందుకె నీ వానలు వెట్టితిని

చ. 1: యీడు జోడై కూడి నీవె యిచ్చినచనవునను
       ఆడినట్టె ఆడి నిన్ను నలయించితి
       జాడతోడి నా వొళ్లి జవ్వనమదమునను
       వోడక నీ వంటితేను వోప నంటిని

చ. 2: మంతనము లాడినట్టి మందెమేళముననె
       పంతములే నీ యడకుఁ బచరించితి
       అంతగా నీ విచ్చినట్టి అతిరాజసమునను
       సంతసాన నీకు మంచము దిగ నైతిని

చ. 3: మదనకేలిఁ జొక్కించి మన సిచ్చినందువంక
        పదిమారులును నిన్నుఁ బచ్చి సేసితి
        యిదె శ్రీవెంకటేశ్వర నీ వెనయుపరవశాన
        వుదుటు మీరఁగ నీవురముపై నెక్కితి