పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0303-4 బౌళి సంపుటం: 11-016

పల్లవి: ఎందు వొయ్యే మిఁకనూ యెరిఁగేము గాక నిన్ను
         కందువలనె తెలిపేఁ గానీవయ్య యిపుడు

చ. 1: యింతుల తిట్లకును యెగ్గు వట్టెవారె కాక
       సంతసించి నవ్వు నవ్వేజాణ లెవ్వరు
       అంతలోనే నని వచ్చే వాయము సోఁకనాడి
       పంత మెల్లఁ గనుకొనే పదవయ్య లోనికి

చ. 2: కొమ్మల సణఁగులకు గోర సేసేవారె కాక
        సమ్మతించి మెచ్చు మెచ్చేజాణ లెవ్వరు
        కమ్మర దీకోనేవు నీకడమ లెల్లాఁ బాపి
       నమ్మి నీవోపిక చూచేఁ బదవయ్య లోనికి

చ. 3: మగువల మేకులకు మట్టుపడేవారె కాక
        జగములోఁగా దనేటిజాణ లెవ్వరు
        నిగిడి శ్రీవెంకటేశ నిన్ను నేనె కూడితిని
        పగటు లేరుపరచేఁ బదవయ్య లోనికి