పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0303-2 హిందోళవసంతం సంపుటం: 11-014

పల్లవి: ఆపాటి కాపాటి అంతే చాలు
         యేపొద్దు నీజాడ లెల్ల నెరఁగనా నేను

చ. 1: ప్రేమము లేనిమాట పెదవిపైనె వుండు
       కామించని చూపు లెల్లఁగడల నుండు
       ఆముకొని తలపోఁత లాతుమలోననె వుండు
       యేమిటికి నును ముట్టే వెరఁగనా నేను

చ. 2: తమి లేనిపొందికలు తనువుమీఁదనె వుండు
       కొమరాఁక లెల గోరికొనల నుండు
       అమరని సరసాలు ఆసాసలై యండు
       యిముడకు మమ్ము నందతే నెరఁగనా నేను

చ. 3: అంకెకు రానివేడుక లరమరపుల నుండు
       లంకె గానపెనఁగులు లావుల నండు
       పొంకపు శ్రీవెంకటేశ భోగించితివి నన్ను
       యింకా నేల అనుమానా లెరఁగనా నేను