పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0303-1 వసంతవరాళి సంపుటం: 11-013

పల్లవి: పంతపువా రెల్ల నిటువలె మొక్కేరా
         యింత నీవు నావలె యెన సుండేరా

చ. 1: యీకడ తమ అంకెల కింతె కాక కాంత లెల్ల
       నీ కిచ్చకము లాడేరా నేనె కాక
       మేకొని మీఁద మిక్కిలి మేనరికపువా రింతె
       నాకొలఁది నీసేవకు నన్నుఁ బోలేరా

చ. 2: వలచినవారు తమవైపులె చూతురు గాక
       నెల వై నిన్ను మెచ్చేరా నేనె కాక
       వొలసి యిందరు నీ నవ్వులతోడివా రింతె
       నలువంక నీపట్టుకు నన్నుఁ బోలేరా

చ. 3: పచ్చిగా గూడినవారు పరవశు లింతె కాక
       నిచ్చ నిన్నుఁ జొక్కించేరా నేనె కాక
       యిచ్చఁ గూడితి శ్రీవెంకటేశ నన్నుఁ బరు లెల్ల
       నచ్చుల నీలాగులకు నన్నుఁ బోలేరా