పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0302-5 రామక్రియ సంపుటం: 11-011

పల్లవి: సిగ్గరి చెలులము నీచిత్తము వచ్చునో రాదో
         యొగ్గులు తప్పు లెంతుము యింతేసికి నోప

చ. 1: చనవు లెల్ల నెరపి సలిగెలఁ బొరలుచు
       ననుపు నీ కాపె సేసీ నాయెదుటనె
       మనసు వచ్చు నీ కది మాకు నిన్ను నన నేల
       చెనకి యింకా బనులు నేయించుకో నీవు

చ. 2: తగులాలు చెప్పుకొని దండ నుండి కుంచ వేసి
       నగీ నాపె నితోను నాయెదటనె
       జిగి నీకు బ్రియ మిది చింతలు రేఁచఁగ నేల
       వొగరు లే కింకా నందె వోలలాడు నీవు

చ. 3: అంటి మేను దాఁకించి ఆకుమడిచి నీ కిచ్చి
       నంటు సేసీ నీతోను నాయెదుటనె
       గొంటవై శ్రీవెంకటేశ కూడితిని నన్ను నిట్టె
       దంటతనమున నవి తలఁచుకో నీవు