పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/611

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9117-05 రామక్రియ సం: 04-607 కృష్ణ

పల్లవి:

ఓయమ్మ యెట్టుసేసె నొకటొకటే
మాయలెల్లఁ జేసినాఁడు మరియింకనెట్టో

చ. 1:

చన్నుదాగి పూతనను సగ్గుడుగాఁ జప్పరించె
మిన్నుదాఁకె సుడిగాలి మెడ దొక్కెను
వెన్న ముచ్చిరిం చి గొల్లవెలఁదులనెల్ల మెచ్చి
పిన్ననాఁడె యింతసేసెఁ బెద్దయైన నెట్టో

చ. 2:

మద్దిమాఁకులు విరిచె మామయింటికేఁగి పెద్ద
యెద్దులఁ బీఁచమణఁచె నేమి వెప్పరు
చద్దికూటి ముద్దలోనె జలజాసనుని మాయ
వద్దనక పతిసేసె వాఁడివో నేడెట్టో

చ. 3:

కొండవంటి పామునోరు కొచ్చి కొచ్చి చంపి చంపి
మెండుకొని వుక్కణంచె మేనమామను
కొండల వేంకటపతి కోనేటిరాయఁడు
నిండు కృప మముఁ గాచేనేరుపిఁక నెట్టో