పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/612

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9121-01 ఆహిరి సం: 04-608 అంత్యప్రాస

పల్లవి:

కటకటా మీరితివి కలికాలమా - పుణ్య
ఘటన గరవై పోయెఁ గలికాలమా

చ. 1:

భూసురుల కామినులు బోయల నామి కులఁ
జేసుకొని యీండ్లై చిచ్చురికిరి
యీసునను నీవలన నెక్కువకులములెల్ల
కాసు సేయకపోయె గలికాలమా

చ. 2:

అన్నలును జెల్లెండ్లు నాండ్లు మగలునునైరి
వన్నె సెడి యతులు ధనవంతులైరి
ఇన్నియును జేసితిని యింకనైనా నీకు
కన్నీరు రాదుగా కలికాలమా

చ. 3:

అరుదగుఁ బతివ్రతలు అభిమానవతులు పలు
దొరలకమ్ముడు వోయి తొత్తులైరి
చిరకాల సుకృత్తమునఁ గొంతైన
కరుణ మార్పితివిగా కలికాలమా

చ. 4:

కోవిదుల మను దొరల కులరాణి వాసములు
త్రోవలనె లంజలై తుదిమీరిరి
ఏవంకఁ జూచినా యిట్లనే ధర్మంబు
గావు వట్టితివిగా కలికాలమా

చ. 5:

పట్టభద్రుల నతులు పలుమారు నింద
..........రిపెంబులై దీనులైరి
దిట్టైనఁ దిరువేంకటేశుదాసులు నిన్నుఁ
గట్టవేతురు సుమీ కలికాలమా