పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/610

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9117-04 లలిత సం: 04-608 దేవుడు-జీవుడు

పల్లవి:

అన్నిటాఁ దాము నతిశయులే
యెన్నఁగ నధికులె యెసఁగఁగను

చ. 1:

పరంపరలగు భవములఁ బొడమియు
చిరంతనుసే జీవులిదే
ధురంధరులే దురిత సుక్కతముల
జరామరణ విశారదులే

చ. 2:

సదా బహుల విషయమత్తులయ్యు
మదాతురులే మనుజులిదే
ముదాసక్తులే మోహవిదూరులే
చిదానందులే చిరయశులే

చ. 3:

భృశం సుఖులే పుణ్యులందరు
సుశాంతాత్ములే శుభమతులే
విశారదులే వేంకటరమణుని
వశంవదులే వరిష్ఠులే