పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/609

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9117-03 శ్రీరాగం సం: 04-605 తిరుపతి క్షేత్రం

పల్లవి:

పొల్లమెల్లఁ దిరిగిన బోడెద్దు
గరిమెలో తో నెవ్వరికి దగ్గరి రాని యెద్దు

చ. 1:

పురములు సాధించ బూనినప్పుడు భూమి
భరమెత్తి నిలచిన బండెద్దు
పరివోని మందల పసులఁ బోఁదోలి శ్రీ
వరుఁడై రోలఁ గట్టువడినెద్దు

చ. 2:

ఒడలెత్తి నాలుగుయుగముల బడిఁ
బడి ధర్మదేవతై పరగినెద్దు
తడవి దేవరలను దామెర లను గట్ట
గడఁగి మానిసిరూపు కపిలెద్దు

చ. 3:

గోవైన భూదేవి గూరిమిఁ జేకొని
లావైన వృషభాచలపు టెద్దు
మోపఁగ వేదాలు మొల్లమై సిరితోడ
శ్రీ వేంకటాద్రి మించిన మాయలెద్దు