పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/608

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9117-02 కేదారగౌళ సం: 04-604 మనసా

పల్లవి:

నారాయణుని శ్రీ నామమిది
కోరినవిచ్చీఁ గోవో మనసా

చ. 1:

శుక వరదుని సొంపుగఁ దలఁచుటె
సకల భవ విజయము
అకలంకము మహా భయ హరణ
మొకటి నొకటి వోహో మనసా

చ. 2:

పక్షిగమన శుభము దలఁచుటే
అభయభోగ విహారమ్ము
వక్షపు లక్షీవరుసే సిరులు
లక్షలు గోట్లొల్లవొ మనసా

చ. 3:

ఇంకా నీతలఁపులెన్ని గలిగిన
వేంకటాధిపు సేవించఁగదో
అంకెలకిన్నియునైన యీ
మంకపు గాక నమ్మవో మనసా