పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/604

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9116-02 సామంతం సం: ౦4-600 వేంకటగానం

పల్లవి:

మునుకలుగఁ బీలిచీ మూఁడు లోకాలు
ధనము బందెలచేతఁ దగనందుకొనుచు

చ. 1:

పరుసవారిఁ బిలువ బడిబడిఁ బారితెంచి
ఒరసు దైవాల మిండఁడూళ్ళ వెంట
సిరసు పంచెముపాగఁ జెరిగిన చుంగులతో
గరుసుమీరిన యీవిఁ గప్పములు గొనుచు

చ. 2:

లాట భోట కుకుర మరాట దేశాల ఘనుల
కూటువలు గూడించి కోట్లసంఖ్య
పేటలుఁ బేటలు పెనుఁగూటములుగాఁ దెచ్చి
చాటువైన వరములు చల్లువెదలాడుచు

చ. 3:

గక్కన నెదురువచ్చి కనిపించుకొను వాఁడె
వెక్కసపు మహిమల వేంకటేశుఁడు
పక్కల వనములెల్లఁ బసిఁడిగాదెల నించి
మొక్కులు గైకొని వరములు గోకొండనుచు