పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/603

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9116-01 ముఖారి సం: 04-599 గురు వందన, నృసింహ

పల్లవి:

నేర్పుకంటెఁ బెన్నిధి గద్దా
ఓర్పుకంటె సుఖమొకటిఁక గద్దా

చ. 1:

కరుణకు నెక్కుడు గతి యిఁకఁ గద్దా
సరసతకెక్కుడు సరి గద్దా
గురుమతిఁ జత్తము కూరిమి నిలిపిన
వెరవుకంటె విధమిక గద్దా

చ. 2:

కలిమి కంటెఁ జీఁకటి మరి కద్దా
బలిమికంటె నాపద గద్దా
గెలుప (గఁ) దెలిసి లంకించిన మతితోఁ
జెలఁగుకంటె నిజసిరి యిఁకఁ గద్దా

చ. 3:

పోయముకంటె నపాయము గద్దా
కాయపు రోఁతకుఁ గడ గద్దా
పాయక వేంకటపతి కృప గోరిన
యీయభిమతమున కెదురిక గద్దా