పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/602

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9111-01 ముఖారి సం: 04-598 హనుమ

పల్లవి:

నెరబిరుదిన్నిటాను నీ బంటు
వొరసె గగనమదివో నీ బంటు

చ. 1:

ముంచిన చుక్కలు మొలపూసలుగాఁ
బెంచె మేను పెళపెళనార్చి
అంచులు మోవఁగ నబ్జభవాండము
నించె నార్భటము నీ బంటు

చ. 2:

గగనలోకములు గడగడ వణఁకఁగ
నెగసె హుటాహుటి నీ బంటు
మగటిమి మెరయఁగ మందులకొండకు
నిగిడి కోయనుచు నీ బంటు

చ. 3:

ఇమ్ముల రఘుపతి హితుఁడై సీతకు
నెమ్మన మలరిన నీ బంటు
కమ్మర నిదె వేంకటేశ నీచే
నిమ్మపండైన నీ బంటు