పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/601

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9108-03 భూపాళం సం: 04-597 నామ సంకీర్తన

పల్లవి:

నందకధర నందగోపనందన
కందర్పజనక కరుణాత్మ

చ. 1:

ముకుంద కేశవ మురహర
సకలాధిప పరమేశ్వర దేవేశ
శుకవరద సవితృ సుధాంశులోచన
ప్రకటవిభవ నమో పరమాత్మ

చ. 2:

ధ్రువ పాంచాలీ స్తుతివత్సల మా
ధవ మధుసూదన ధరణిధరా
భువనత్రయ పరిపోషణ తత్పర
నవనీతప్రియ నాదాత్మ

చ. 3:

శ్రీమన్‌ వేంకటశిఖరనివాస మ
హమహిమన్‌ నిఖిలాండపతే
కామితఫలభోగప్రద తే నమో
స్వామిన్‌ భూమన్‌ సర్వాత్మన్‌