పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/600

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9108-02 సామంతం సం: 04-596 వైరాగ్య చింత

పల్లవి:

గద్దరి జీవుఁడు కామధేనువు మాని
యెద్దుఁ బిదుకఁ జొచ్చె నేది దెరఁగు

చ. 1:

మటమాయములఁ దనమనసె చంచలమంది
ఇటునటుఁ దిరిగిన నేది దెరఁగు
కటకట వూరేలు కర్తే దొంగలఁగూడి
యెటువలెఁ జేసిన నేదిదెరఁగు

చ. 2:

కల్లలాడఁగఁ జొచ్చెఁ గలుషపుమతి సత్య
మిల్లు వెడలగొట్టె నేదిదెరఁగు
చెల్లఁబో నోరే చేఁదుమేయఁగఁ జొచ్చె
నెల్లవారికి నింక నేదిదెరఁగు

చ. 3:

తియ్యని వెంకటాధిపుఁ బాసి పరసేవ
కియ్యకొనెడిఁ జిత్తమేది దెరఁగు
అయ్యొ చక్కనిపతి నాలు విడిచిపోయి
యెయ్యెడఁ దిరిగిన నేదిదెరఁగు