పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/599

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9108-01 ధన్నాసి సం: 04-595 విష్ణు కీర్తనం

పల్లవి:

ఏలయ్య పరమాత్మ యేలికవు మాకునై నాలినే పెట్టితివి నాడూను
కాలునికి మమ్ము సరిగాఁపులే కమ్మనుచు నేలనే తిప్పేవు నేఁడూను

చ. 1:

భారమగు నీటిలోఁ బవళించి నీ వాది నారాయణుఁడవైతి నాఁడూను
పైరుగా నిందరిని ప్రకృతి లోపలఁదెచ్చి నారుగాఁ బోసితివి నాఁడూను
నారు పేరిడి తండ్రి నందనుని బిలవఁ గరుణారసము నించితివి నాఁడూను
చేరి కడు మమ్ము రక్షింపనోపక వట్టి నేరములె యెన్నేవు నేఁడూను

చ. 2:

దట్టముగఁ జొచ్చి యిందరిదేహములలోన నట్టనడుమెక్కితివి నాఁడూను
అట్టలుగ బ్రహ్మాండమవియించి జంతువుల నట్టేట ముంచితివి నాఁడూను
ఒట్టి యిందరికి సరయూదరిని మోక్షంబు నట్టు కొట్టితి గొంత నాఁడూను
పొట్ట పొరుగునఁ దెచ్చి భూతముల మెడగట్టి నిట్టి పిడినేఁపేవు నేఁడూను

చ. 3:

పొలువుగా మమ్మిట్లఁ బుట్టించుకొరకునే నలిన నాభుఁడవైతి నాఁడూను
పలువేలుపులకెల్ల పదవులిన్నియు నొసగి నలుగడల నునిచితివి నాఁడూను
చలముకొని దానవులఁ జక్కాడి దేవతల నలఁకువలు దీర్చితివి నాఁడూను
చెలఁగి యిందరిఁగావ శ్రీ వేంకటాద్రిపై నెలకొనిటు నిలిచితివి నేఁడూను