పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/598

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9106-01 శ్రీరాగం సం: 04-594 వైరాగ్య చింత

పల్లవి:

ఎవ్వరిఁ దలఁపఁడు ఎవ్వరి నొల్లఁడు
నవ్వుల తెరువులె నడచీఁ బ్రాణి

చ. 1:

కలుషముఁ బుణ్యము కర్మపుఁ జేనను
వెలయఁగ జీవుఁడు విత్తుచును
కలిగిన సుఖదుఃఖములను గాదెల
కొలుచులు నించుక కుడిచీఁ బ్రాణి

చ. 2:

చెడని ప్రపంచము శెశెదిదిలో
నిడుపు గురుచలుగ నేసినది
వడి దేహములను వన్నెల వన్నెల
గడనల చీరలె కట్టీఁ బ్రాణి

చ. 3:

కూరిమిఁ గామక్రోధాదులు మతి
చూరలఁ గొనియెడి చుట్టములే
గారవముల వేంకటపతిఁ గొలువక
చేరి కాఁపురము సేసీఁ బ్రాణి