పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/597

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9105-01 ముఖారి సం: 04-593 వైష్ణవ భక్తి

పల్లవి:

మొక్కరో మీరు మోసపోక - మీకు
దిక్కుదెసైన ఆదిదేవునికి

చ. 1:

మారుచేతులీయవద్దు మారుగాళ్ళీయవద్దు
బీరాన గుండెలు గోసి పెట్టవద్దు
గోరపడి చిచ్చులోన కొండాలు చొఱవద్దు
ఊరకే మీవారమని వున్నఁ జాలు

చ. 2:

సిడిదలలియ్యవద్దు జీవాలఁ జంపవద్దు
బడి బడి పగ్గాలఁ బారవద్దు
సిడిమీద బిత్తరప బిమ్ములు చిమ్మఁగవద్దు
కడనుం.........................దారి గన్నఁ జాలు

చ. 3:

బగ్గన యెక్కడ డొక్కపడునో యేమరవద్దు
బగ్గివడ్డ యమబాధఁ బడవద్దు
ఎగ్గు సిగ్గులేక వేంకటేశుని దాసులఁజేరి
అగ్గలపు పాదరేణువైనఁ జాలు