పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/596

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9087-01 శ్రీరాగం సం: 04-592 వేంకటగానం

పల్లవి:

కత్తరాలు చిమ్ముచుండెఁ గదలుచుండె
చిత్తజ జనకుఁడైన శ్రీ మూరితి

చ. 1:

కన్నులఁ జొక్కుచునుండె కంపితము మీఁటుచుండె
సన్నపు సొలపు నిగ్గు సళుపుచుండె
అన్నువ నడిమి యింతి నక్కున నొత్తుచునుండె
ఉన్నతిఁ గోనేటిదరినున్న మూరితి

చ. 2:

మేసులు ముట్టుచునుండె మేడమీఁద నిలుచుండె
కీసిన గోక గిలిగింపుచునుండె
నేసకొప్పురమణికి చెక్కులు నొక్కుచునుండె
తీసిన లంఘితముల దివ్యమూరితి

చ. 3:

కిలకిల నవ్వుచుండె కిన్నెర వట్టుచునుండె
పలుమెరుఁగులు దోఁప బాడుచు౦డె
అలమేలుమంగమీఁద నలరి యొరగి యుండె
వెలయ వేంకటగిరి వేదమూరితి