పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/595

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9086-02 ఆహరి సం: 04-591 వైష్ణవ భక్తి

పల్లవి:

కలియుగంబునకుఁ గలదిదియే
వెలసిన పంచమవేదమె కలిగె

చ. 1:

బోధల హరినుతి పొడమెను శూద్ర
స్సాధని కలిదోషము మాన్ప
రాధా మాధవ రచన సకలజన
సాధువేదమే జగమునఁ గలిగె

చ. 2:

పరమగు వేదము బహుళము చదివియు
హరి నెరిఁగిన వారరుదనుచు
తిరువాముడియై దివ్యమంత్రమై
వెలసిన పంచమ వేదమె కలిగె

చ. 3:

బింకపు మనుజులు పెక్కులు చదివియు
సంకె దీరదెచ్చట ననుచు
సంకీర్తనమే సకలలోకముల
వేంకటేశ్వరుని వేదమె కలిగె