పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/594

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9086-01 దేసాళం సం: 04-590 వైరాగ్య చింత

పల్లవి:

ఎన్నాళ్ళున్నా నిట్టె కదా
విన్నని వెరగులె వేఁడుకలాయ

చ. 1:

భువి నెట్టుల్లాఁ బోయేదే కా
చవులకుఁ జవియగు శరీరము
ధ్రువమని యీ సుఖదుఃఖ రోగములు
భవముల కిదియే బందములాయ

చ. 2:

ఎంత వొరలినా నిదే తాఁగద
కంతల కంతల కాయమిది
బొత దగులుచుక పొరలఁగఁ బొరలఁగ
సంతకూటములె సరములాయ

చ. 3:

కైపుసేసినా ఘనమౌనే కా
పాపముఁ బుణ్యముఁ బైపైనే
యీ పుట్టుగునకు ఈ వెంకటపతి
దీపించఁగఁ బెనుఁదెరువొకటాయ