పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/591

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9౦84-01 దేవగాంధారి. సం: 04-587 వైరాగ్య చింత

పల్లవి:

ఈజీవునకు నేది గడపల తనకు
నేజాతియును లేక యిట్లున్నవాఁడు

చ. 1:

బహుదేహ కవచములఁ బారవేసినవాఁడు
బహుస్వతంత్రముల నాపద నొందినాఁడు
బహుకాలముల మింగి పరవశంబైనాఁడు
బహుయోనికూపములఁ బడి వెడలినాఁడు

చ. 2:

పెక్కుబాసలు నేర్చి పెంపు మిగిలినవాఁడు
పెక్కు నామములచే జలువఁబడినాఁడు
పెక్కుకాంతలతోడ పెక్కుపురుషులతోడ
పెక్కులాగులఁ బెనఁగి బెండుపడినాఁడు

చ. 3:

ఉండనెన్నఁడుఁ దనకు ఊరటెన్నఁడు లేక
యెండలకు నీడలకు యెడతాఁకినాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయని
యండ చేరెదననుచు నాసపడినాఁడు