పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/586

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9080-02 పాడి సం: 04-582 పోలికలు

పల్లవి:

కలుషపు చీకటి గలుగఁగను
వెలుగు లోకముల వెలసిన యట్లు

చ. 1:

మునుకొని పాతకములు గలుగఁగఁబో
జనులకుఁ బుణ్యము చవులాయ
ఇనుము గలుగఁగా ఇందరి యెదిటికి
కనకము ప్రమోదకరమైనట్లు

చ. 2:

జగములోపల విషముగ గలుగఁ బో
మిగులఁగ నమృతము మేలాయ
వగపు గలుగఁగా వడి సంతోషం
బగపడుటిందరి కబ్బురమాయ

చ. 3:

బహుదైవంబుల ప్రపంచవిదులఁ బో
మహిమల శ్రీహరి మనసాయ
విహగ గమనుఁడగు వేంకటేశ్వరుడు
ఇహమియ్యఁగఁ బరమిచ్చైనట్లు