పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/585

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9౦8౦-01 ముఖారి సం: 04-581 వైరాగ్య చింత

పల్లవి:

కనుఁగాక పుణ్యాలు కడఁబడెనా
తనువు లేదో చేతనము లేదో

చ. 1:

మోసపోతినననేల మురుగ వగవనేల
చేసుఁగాక పుణ్యాలు చీమ దుమ్మెనా
దాసుఁడుఁగా దా లేఁడొ తలఁప శ్రీహరి లేఁడొ
వీసమంతగాలమైన విధిలేదో

చ. 2:

తల్లడించి పడనేల దైవము దూరనేల
చెల్లఁబో నేఁడే పండి పొల్లవోయెనా
ఉల్లములో హరి లేఁడో ఒద్దికతోఁ దా లేఁడో
కొల్లలాడఁ బుణ్యములకోరిక లేదో

చ. 3:

చచ్చి చచ్చి పుట్టనేల జముబారిఁ బడనేల
నొచ్చి నొచ్చి మరుచేత నొగులనేల
యిచ్చలేదొ తిరువేంకటేశుఁడొద్దనె లేఁడో
నిచ్చ నిచ్చఁ దనకింత నేరుపు లేదో