పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/584

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9079-01 దేశాక్షి సం: 04-580 వైరాగ్య చింత

పల్లవి:

ఎవ్వరుగల రెవ్వరికి
ఇవ్వల నవ్వల నితఁడేకాక

చ. 1:

ముద్ద సేసినటు మొదలఁ గడుపులోఁ
బెద్దగాఁ దాఁ బెరుగునాఁడు
ఒద్దనెవ్వరుండిరొకరైనా
ఒద్దికైన బంధుఁడొకఁడేకాక

చ. 2:

వరతఁ బోవునట్టి వడిసంసారపు
తెరలఁ దగిలి తాఁ దిరుగునాఁడు
వెరవకుమని భావించువారెవరు
తరితోడ నీతఁడె కాచుఁగాక

చ. 3:

ఉడుకఁ బెట్టినట్టి వుడివోయిన నరకాల
నుడుకుచుఁ దానుండునాడు
తడవువారెవ్వరంతటఁ దన్ను
కడవేగ వేంకటపతిగాక