పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/583

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9075-02 ----‌ సం: 04-579 వైష్ణవ భక్తి

పల్లవి:

నీ కథామృతము నా నిరత సేవన నాకు
చేకొనుట సకల సుఖ సేవనంబటుగాన

చ. 1:

ఇదియె మంత్రరాజము నాకు నేప్రొద్దు
నిదియె వేదసంహిత పాఠము
ఇదియె బహుశాస్త్రమెల్లఁ జదువుట నాకు
ఇదియె సంధ్య నాకిదియె జపమటు గాన

చ. 2:

ఇదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు
ఇదియె దుఃఖవిరహితమార్గము
ఇదియె బహులోకహితభేషజము నాకు
ఇదియె వుపనిషద్వాక్యపద్ధతిగాన

చ. 3:

ఇదియె దానఫలమియ్యఁ జాలును నాకు
ఇదియె తపవిరహిత కర్మము
ఇదియె తిరువేంకటేశ్వరుని సంస్మరణ
ఇదియె యిదియె యిన్నియును నటుగాన