పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/587

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9080-03 -- సం: 04-583 వైరాగ్య చింత

పల్లవి:

ఓపనయ్య వోపనయ్య

ఓపనయ్య యీ యొప్పులే తప్పులు

చ. 1:

ఎక్కడికి నెక్కడ - యెక్కువే యెరవు
తక్కులే యీ మొక్కులు - తక్కువే దారణ

చ. 2:

ఎవ్వరికి నెవ్వరో నవ్వులే నొవ్వులు
తవ్వలే యీరవ్వలు - చివ్వలే సిగ్గులు

చ. 3:

బొంకులే పొందులు - కింకలే గిరులు
వేంకటవిభుఁడ నీ - జంకెలే జంపులు