పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/581

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9074-04 మేచబౌళి సం: 04-577 కృష్ణ

పల్లవి:

అచ్చపు రాల యమునలోపల
ఇచ్చగించి భుజియించితి కృష్ణ

చ. 1:

ఊరుఁగాయలును నొద్దిక చద్దులు
నారగింపుచు నందరిలో
సారె బాలుల సరసాలతోడ
కోరి చవులు గొంటివి కృష్ణా

చ. 2:

ఆకసంబున కాపుర ముఖ్యులు
నాకలోకపు నాందులును
కైకొని యజ్ఞకర్త యాతడని
జోకఁ గొనియాడఁ జొక్కితి కృష్ణా

చ. 3:

పేయలు లేవు పిలువుఁడనుచు
కోయని నోరఁ గూఁతలను
మాయల బ్రహ్మము మతము మెచ్చుచు
చేయని మాయలు సేసితి కృష్ణా