పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/580

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9౦74-03 భూపాళం సం: 04-576 ధనుర్మాసం

పల్లవి:

ముదమలర కాలముల మీరిటు మోసపోక
హృదయమలర భజింపరో మీ రిటు ధనుర్మాసముల విధులన్‌

చ. 1:

వేగ నాలుగు ఘడియలనఁగా వేదవేద్యులు లేచి సరగున
నాగమోక్తవిధులను తమదేహానుగుణములుగా
వేగమున సంధ్యాదులొగిఁ గావించి విమలాంభోధిశయనుని
బాగుగాఁ బూజించరో యెడపక ధనుర్మాసముల విధులనె ఘనులు

చ. 2:

పరగు చీనాంబరములను నతి పరిమళమ్ముల బుష్పముల కడు
వెరవుగా వేంకటపతి వేద్యసంగతుల అరుదుగా
ధూపముల బహుదీ పాదులను తాంబాలవిధులను
పరగఁ బూజింపుఁడు సమస్త ప్రభు ధ్రనుర్మాసమున విధుల ఘనులు