పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/579

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9074-02 ఆహిరి సం: 04-575 నామ సంకీర్తన

పల్లవి:

నన్నునింత సేయుకంటె నవ్వులున్నవా పంట
మన్నుపైఁడిముద్దగాఁగ మన్నుపూసె నితఁడు

చ. 1:

పంచమహాపాతకులఁ బరమపావనులఁగా
వించఁ బూనె నిందుకంటె విద్యలున్నవా
ఇంచుకంత హరినామమింతలోననె ముట్టు
పెంచు దెచ్చి మాణికపుబిల్ల సేసె నితఁడు

చ. 2:

మాలవాని కష్టవిద్య మందవెట్టి బ్రహ్మవిద్య
పాలుసేసె నిందుకంటె బ్రతుకున్నదా
నాలుకందునున్న విష్ణునామమంత్రము చెప్పు
తోలుబిల్ల మాడకంటె దొడ్డసేసె నన్నును

చ. 3:

కుక్క దెచ్చి గంగిగోవు కొదమగాఁగ భూమిలోన
ఒక్కమాట యింతసేయ నోపవచ్చునా
దిక్కులందు వేంకటేశు దివ్యనామము రోఁత
కక్కుఁగూటి నమృతజలధిఁ గావించె నన్నును