పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/578

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9074-01 లలిత సం: 04-574 అధ్యాత్మ

పల్లవి:

భవములు వీడఁగఁ బాలించి
చవి మరపెను మోక్షము తెరువు

చ. 1:

కర్మకోట్లకు గడిచీటిచ్చెను
నిర్మలమతులకు నేఁడిపుడే
ధర్మమార్గమునఁ దడవి నడచుటకు
నర్మిలిఁ బుణ్యములందుటకు

చ. 2:

ముంజేతద్దము మూలదాముగా
సంజీవని సరసత నొసఁగె
గొంజ సుకృతములు కుమ్మరించి హరి
రంజించెను సర్వజనులకు

చ. 3:

పట్టముగట్టెను ప్రాణులకెల్లను
గట్టిగఁ దిరు వేంకట విభుఁడు
ఒట్టిన యాపదలూడఁదోలి జను
లిట్టే నిజసుఖమిచ్చుటకు