పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/566

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9౦49-01 కాంబోది సం: 04-562 ఉపమానములు

పల్లవి:

తల్లిఁ బాసి బిడ్డలెల్లఁ దల్లడించినట్టు నా
పల్లదా లెవ్వరి పాలయ్యీనో తాము

చ. 1:

మేదరింటి లంజవోయి మేదినీశుఁ దగులఁగ
గోదిలి కువిటులెల్లఁ గుల్లినయట్టు
ఆదిగొని నేఁబోయి హరిఁ గొలువఁగ నా
గాదిలి కర్మములేడఁ గంటివో తాము

చ. 2:

కాఁపుటూరి మంగలోజు గడిమీఁది రాజుగాఁగ
కాఁపులెల్లాఁ బనిమాసి కందినయట్టు
ఆఁపలేక నేఁబోయి హరిఁ గొలువఁగ నా
పాపము లెవ్వరి పంచపాలయ్యీనో తాము

చ. 3:

ఒట్టిన మోఁపులు మోవనోపక వూరువిడిచి
వెట్టివాఁడు పారిపోఁగా వెదకినట్టు
ఇట్టె నేను శ్రీవేంకటేశుఁ గొలువఁగ నా
చుట్టము లిందరు నేడఁ జొచ్చేరో తాము