పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9047-03 కాంబోది సం: 04-561 జోల

పల్లవి:

వాగె బలువు దైవపురాయా - నీ
రాగె జతనము పరాకెచ్చరికె

చ. 1:

మించులఁ దురగము మిన్నులు మోపగ
నంచలఁ గురుచల నాడఁగను
కంచు మించుగా గక్కనఁ దోలితి
పంచాస్త్రగురుఁడ పాదెచ్చరికె

చ. 2:

పెక్కువతేజిటు పేరెమువారఁగ
తొక్కనిచోట్లు దొక్కఁగను
చుక్కలు మోపఁగ సొంపుగఁ దోలితి
తొక్కుల దేవరదేవెచ్చరికె

చ. 3:

అంకవన్నె పాదాబ్జము పదిలము
వేంకటేశ తిరువీధులను
సంకెలేక శ్రీసతితోఁ జెలఁగెడి
అంకెల జాఁగు భళా యెచ్చరికె