పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/567

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9049-02 పాడి సం: 04-563 నామ సంకీర్తన

పల్లవి:

నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో

చ. 1:

మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ
పరమ పురుష భవ బంధ విమోచన
నర మృ గశరీర నమో నమో

చ. 2:

జలధి శయన రవిచంద్ర విలోచన
జలరుహభవనుత చరణయుగ
బలిబంధన గోపవధూవల్లభ
నలినోదర తే నమో నమో

చ. 3:

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప
వేదోద్ధర శ్రీ వేంకటనాయక
నాదప్రియ తే నమో నమో