పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9047-01 శోకవరాళి సం: 04-559 వేంకటగానం

పల్లవి:

వేంకటగిరి గోవిందుఁడా
యింకా నొకరో యిద్దరొ మీరు

చ. 1:

పచ్చలు దాచిన బాహుపురులతో
అచ్చపుఁ గరముల అందముతో
అచ్చలు నిచ్చలు నలను (రు?) దురిదివో
నిచ్చలు నీవో నీవో కాని

చ. 2:

నిలుచుండుటయును నెరిఁ బవళింపుచు
నలరుటయును మీరటు నిటును
జలజాక్షులు దొడ చరచఁగ నొరపుల
వెలయగ నిద్రో విభవమిదో

చ. 3:

తిరు వేంకటగిరి దిగువ తిరుపతిని
పరమానందపు బహుసిరులు
అరుదుగఁ బొందుచు అధికములందుచు
ఉదగశయనుఁడవొ వొడయఁడవో