పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/559

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9035-02 బౌళిరామక్రియ సం: 04-555 అంత్యప్రాస

పల్లవి:

అదరీ బెదరీ నంతనంత
అదవదలై మాయామృగము

చ. 1:

పొలసీ మలసీఁ బొదలీఁ గదలీ
నెలసీఁ బలుమారు నెలవులను
కలసీ మృగములఁ గ్రమ్మర బెదరీ
అలసీనటు మాయామృగము

చ. 2:

దాఁగీ లోఁగీఁ దటుకన వెనుకకు
వీఁగీ నేఁగీ విసవిసనై
రేఁగీగతి వచరింపుచుఁ జూపుల
నాఁగీనదె మాయామృగము

చ. 3:

వెంకటగిరి రఘువీర నీముందర
కొంకీఁ గొసరీఁ గొనగొనల
జంకెల బాణాసన బౌణంబున
సంకెలఁ బడె మాయామృగము