పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9035-01 భూపాళం సం: 04-554 వేంకటగానం

పల్లవి:

అన్నివిభవముల అతఁడితఁడు
కన్నులు వేవేలుగల ఘనుడితఁడు

చ. 1:

వేదాంతకోట్ల విభుఁ డితఁడు
నాదబ్రహ్మపు నడుమితఁడు
ఆది నంత్యములకు నరుదితఁడు
శ్రీ దేవుఁడు సరసిజ నాభుఁడితఁడు

చ. 2:

భవములణఁచు యదుపతి యితఁడు
భువనములిన్నిటికిఁ బొడవితఁడు
దివికి దివమైన తిరమితఁడు
పవనసుతు నేలినపతి యితఁడు

చ. 3:

గరుడని మీఁదటి ఘనుఁడితఁడు
సిరులిందరికి నిచ్చే చెలువితఁడు
తిరువేంకటనగము దేవుఁడితఁడు
పరమపదమునకుఁ బ్రభుఁడితఁడు