పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/556

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9030-02 భూపాలం సం: 04-552 మేలుకొలుపులు

పల్లవి:

మేలుకొనవే
భూలలనాధిప భోగిశయన

చ. 1:

లేదు వేదవిధి లేశమును
మేదిని భరమై మించినది
పాదుపడదు చూపరకు భువి
గాదిలి సుతుపై గనలె జనకుఁడు

చ. 2:

కనకము చవి చెడెఁ గడుఁగడును
ఘననృపబాధలు గదిమినవి
దనుజుల కతివలు దలఁకెదరు
ఎనయ బలాధికులెవ్వరు లేరు

చ. 3:

అసుర సతుల పుణ్యము ఘనము
కస మసఁగెడి కలికాలమహిమ
పసగల వేంకటపతి యిఁకను
వసుధలోని నెవ్వగలుడుపఁగను