పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/555

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9030-01 దేవగాంధారి. సం: 04-551 కృష్ణ

పల్లవి:

ఇట్టి ముద్దులాఁడి బాలుఁడేడ వాఁడు - వాని
బట్టి తెచ్చి పొట్టనిండఁ బాలువోయరే

చ. 1:

గామిడై పారితెంచి కాఁగెడి వెన్నలలోన
చేమ పూవు కడియాల చేయిపెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిటఁ గన్నీరు జార
వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే

చ. 2:

ముచ్చువలె వచ్చి తన ముంగమురువుల చేయి
తచ్చెడి పెరుగులోన తగఁ బెట్టి
నొచ్చెనని చేయిదీసి నోరనెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే

చ. 3:

ఎప్పుడు వచ్చెనో మాయిల్లుచొచ్చి పెట్టెలోని
చెప్పరాని వుంగరాల చేయిపెట్టి
అప్పఁడైన వేంకటాద్రి అసవాలకుఁడు గాన
తప్పకుండఁబెట్టె వాని తలకెత్తరే