పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/554

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9029-04 రామక్రియ సం: 04-550 వైరాగ్య చింత

పల్లవి:

అంటుకోకురో యమ్మలాలా యీ
మంటవడ్డ కోరికల మాఁటు వారము

చ. 1:

మాసిన యాసలనెడి మాలెత వెంట వెంటనే
పాసి వుండలేక బాధఁబడ్డవారము
బేన బెల్లి యెంగిలైన పదవినంజుడు నోరఁ
దీసి తీసి సారె సారెఁ దిన్నవారము

చ. 2:

ఇట్టు నట్టు ముట్టరాని హేయమైన తోలుఁదోలు
కుట్టి కుట్టి సిగ్గులమ్ముకొన్నవారము
ముట్టు సేయుచోటనే మూలమూల సారె సారెఁ
బుట్టి పుట్టి యాపదలఁ బొందువారము

చ. 3:

చంపి చంపి జీవులనే చవులంటఁ జెడ్డతోలుఁ
గొంపలోనఁ దెచ్చి పెట్టుకొన్నవారము
ఇంపుల నిప్పుడు వేంకటేశుఁజేరి భవముల
చింపి యింటి హరిభక్తి చరవారము