పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/553

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9029-03 నాట సం: 04-549 వైరాగ్య చింత

పల్లవి:

తనకేఁటి యేతులిందరిలోన
పెనఁగుచు నూరక బిగిసీఁగాక

చ. 1:

మరచెనా తనపాటు మాలజీవుఁడు దొల్లి
కొరమాలి బహుయోనికూపముల
పొరలి హేయములోనె పుంగుడువడి వచ్చి
మొరఁగి తా దొరనంట మురిసీఁగాక

చ. 2:

పాసెనా తనపాటు పాపదేహి తా
గాసిఁ బడిన భంగములెల్ల
చేసిన తనతొంటి చేఁతలన్నియును
మాసెననుచు నిట్టె మలసీఁగాక

చ. 3:

విడిచెనా తన పాపవిధులు ప్రాణుఁడు మున్ను
అడరి మానుష రూప మైనంతనే
చెడక వేంకటపతి సేవించి సకలము
కడుగుకొనెడి బుద్ధి కనవలెఁగాక