పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/551

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9౦29-01 సామంతం సం: 04-547 వేంకటగానం

పల్లవి:

పాడైన యెరుకతో బంధమోక్షములొక్క
గాడిఁగట్టుట తెలివిగానకేకాదా

చ. 1:

భావించి నినుఁ బరబ్రహ్మమని వేదములు
వేవేలు విధుల మొరవెట్టఁగాను
కేవలపు నిన్ను దక్కిన దైవములఁ గూర్చి
సేవింపుటిది తప్పు సేయుటేకాదా

చ. 2:

సరిలేని నిను నుపనిషద్వాక్యములె పరా
త్పరుఁడవని నలుగడలఁ బలుకఁగాను
వరుసతోఁ బెక్కు దైవములు సంగడి నిన్ను
తొరలఁ గొలుచుట మహా ద్రోహమేకాదా

చ. 3:

ఎందుఁ జూచిన పురాణేతిహాసములు నీ
చందమే యధికమని చాటఁగాను
చందర్ప జనక వేంకటగిరి స్వామి నీ
కందు వెఱఁగనిది యజ్ఞానమేకాదా