పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/550

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9028-03 ఆహిరి సం: 04-546 శరణాగతి

పల్లవి:

ఓపనయ్య వోపనయ్య
వోపనయ్య యీ వొప్పులే తప్పులు

చ. 1:

ఎక్కడికీ నెక్కడ యెక్కువే యెరవు
తక్కులే యీ మొక్కులు తక్కువే దారణ

చ. 2:

ఎవ్వరికి నెవ్వరో నవ్వులే నొవ్వులు
తప్పులే యీ రవ్వలు చివ్వలే సిగ్గులు

చ. 3:

బొంకులే పొందులు కింకలే గిరులు
వేంకటవిభుఁడ నీజంకెలే జంపులు