పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/520

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0389-04 సాళంగనాట సం: 04-517 రామ

పల్లవి:

జయము మనది వనచరులాల
రయమున దర్మదారలు తుత్తుతూ

చ. 1:

రక్కసుల మీఁద రాముఁడలిగె నలు-
దిక్కుల నడవుఁడు తిడిం తిడిం
యెక్కుఁడు సేనలు యిటు మొరయింపుఁడు
ఢక్కా నినదము ఢమఢమఢమం

చ. 2:

కుటిలదానవులఁ గొట్టుఁడు కోటలు
తటుకున దాఁటుఁడు ధణ౦ ధణం౦
పటుగతినార్చుచు పట్టుఁడు లగ్గలు
పెటులు చూఁడఁ డదె పెట పెట పెటల్‌

చ. 3:

గుట్టున నుండక కూలె రావణుఁడు
పట్టుఁడు సంకులు భం భం భం
యిట్టె శ్రీ వేంకటేశుఁడు గెలిచెను
దిట్టలై యాడుఁడు ధిం ధిం ధిం