పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0356-01 శ్రీరాగం సం: 04-327 హనుమ

పల్లవి:

ఓ పవనాత్మజ వో ఘనుఁడ
బాపుబాపనఁగఁ బరగితిగా

చ. 1:

వో హనుమంతుడ వుదయాచలని -
ర్వాహక నిజసర్వ ప్రబల -
దేహము మోఁచిన తెగువకు నిటువలె
సాహసమిటువలెఁ జాటితిగా

చ. 2:

వో రవిగ్రహణ వో దనుజాంతక
మారులేక మతి మలసితిగా
దారుణపువినతాతనయాదులు
గారవింప నిటు గలిగితిగా

చ. 3:

వో దశముఖహర వో వేంకటపతి -
పాదసరోరుహపాలకుఁడా
యీ దేహముతో నిన్నిలోకములు
నీదేహమెక్క నిలిచితిగా