పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:0336-05 కన్నడగౌళ సం: 04-212గురు వందన, నృసింహ


పల్లవి :

తలరో లోకాంతపరులు తడవము పుణ్యపాపమును
వలె నని శ్రీవైష్ణవులకు వందనమే సేసెడివాఁడ


చ. 1:

తపసిఁ గాను ధర్మిఁ గాను
కృపగల శ్రీపతి కింకరుఁడ
జపితఁ గాను శాస్త్రిఁగాను
వుపదేశపు గురువూళిగకాఁడ


చ. 1:

భయము లేదు భక్తి లేదు
జయభాగవతుల దయవాఁడ
ప్రియము న్నెరఁగను పెరిమ న్నెరఁగను
ద్వయాధికారముఁ దగిలినవాఁడ


చ. 1:

జ్ఞానము లేదు మానము లేదు
పూని శ్రీవేంకట పురుషుఁడిదె
నానాటఁ దెలిపి నను మన్నించెను
సానఁదేరి తన శరణమువాఁడ