పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0336-01 నాదరామక్రియ సం: 04-208 వైరాగ్య చింత


పల్లవి :

ఏమని విన్నవించేను యెన్నెని కాచేవు నీవు
శ్రీమాధవుడ నీకుఁ జేతికి లోనయ్య


చ. 1:

పుట్టినదె వొకతప్పు భువిమీఁద నటమీఁద
నెట్టన సంసారినౌటే నిజము రెండోతప్పు
రట్టుకెక్కి దొరనౌటే నెట్టన మూఁడోతప్పు
యిట్టె కావు కావకుండు మిదివో నాతప్పు


చ. 2:

అన్నపానములు గోరినదియే మొదలి బందె
యెన్నఁగఁ గాంతలఁ గూడుటిదివో రాతిటిబందె
కన్నవారి వేఁడేది కడతొడుకుబందె
కొన్నిట నేమి గొనేవు కొనవయ్య బందె


చ. 3:

కొనఁ బుణ్యపాపాలే గొడియకట్లు రెండు
కొనిరి నీదాసులే కోరిన తప్పుదండము
వినవయ్య యిదివో శ్రీ వేంకటేశ నామనవి
మనుఁగాఁపుఁ జేసితివి మన్నించవయ్య